రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ : ఓటర్ల జాబితా విషయమై ఏపీలో అవకతవకలు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ
అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. సోమవారం ఓటరు అవగాహనపై
బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుల
చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఓటు అని చెప్పుకొచ్చారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు
గతంలోనూ ఇప్పుడూ జరుగుతున్నాయన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను
తొలగించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వేల సంఖ్యలో ఓట్ల
విషయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉరవకొండలో ఓటర్ల జాబితాలో
అవకతవకలకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారన్నారు. ఉరవకొండ
ఎమ్మెల్యే పయ్యావుల ఇచ్చిన ఫిర్యాదుతో సస్పెన్షన్ చేశారని తెలిపారు. ఓటర్ల
జాబితా పర్యవేక్షణ కోసం స్థానికంగా కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. వలంటీర్ల
ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల జాబితాలో చేరికలు, తీసివేతలు
జరుగుతున్నాయన్నారు. వలంటీర్లు పంపిన సమాచారాన్ని క్రోడికరించి అవకతవకలకు
పాల్పడేందుకు హైదరాబాదులో ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశారని తెలిపారు. ఇలాంటి వాటి
విషయంలో బీజేపీ సీరియస్‌గా వ్యవహరిస్తుందని పురందేశ్వరి పేర్కొన్నారు.
ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు
తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్‌దే * మద్యాన్ని
నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? * బీజేపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
విజయవాడ : జగన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి
సంజయ్ ధ్వజమెత్తారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక
సర్కార్ జగన్‌దే. మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్
చేస్తారా?. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ
పడుతున్నాయి. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది.
ఇప్పుడున్న ఏపీలో మాదిరిగా దేశంలోనూ ఆనాడు బీజేపీని హేళన చేశారు. ఏమైంది?.
హేళన చేసిన పార్టీలే నామరూపాల్లేకుండా పోయాయి. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు
జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయి.
డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో
అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది. కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం
ఆసన్నమైంది. ఈసారి వైఎస్సార్ సీసీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో
భావన నెలకొంది. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు
తొక్కుతోంది. ” అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అసెంబ్లీ
నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో
నిమగ్నమైంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. అనంతపురం
జెడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ఏపీలో హిందూ
మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో
అడగడుగునా ఆందోళన సృష్టిస్తూ రాకుండా చేస్తున్నారు. భక్తులను కాపాడలేక
కర్రలిస్తారా?. వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి
గుర్తుంచుకోవాలి. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ. ఆయన బిడ్డ పెళ్లి
క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజంకాదా?. నేను నాస్తికుడని ఆయన గతంలో
చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా?. ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే
తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నడట.మరి ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో.
నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారు. పవన్
కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత. ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను
అడ్డుకోవడం దారుణమని బండి సంజయ్ మండిపడ్డారు. ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్
అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న
ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారు. రెండు
రాష్ట్రాలు విడిపోయాయి. మనమధ్య మనస్పర్ధల్లేవ్. అందరం బాగుండాలని
అనుకుంటున్నాం. ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం దాగుడు మూతలు ఆడుకుంటున్నారు.
మళ్లీ అధికారంలోకి రావడానికి మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు కుట్ర
చేస్తున్నారు. నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. మీరు
హిందువులుగా ఆలోచించండి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నయ్. దేవతా
విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఒక మతానికే కొమ్ముకాస్తూ ఆ మతమే అధికారం
చెలాయించాలని చూస్తున్నారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు?. జెండాలు,
ఎజెండాలను పక్కనపెట్టి సంతూష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం రండని బండి
సంజయ్ అన్నారు. ఓటర్ చైతన్య మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్‌లో బీజేపీ ఎంపీ
బండి సంజయ్ ప్రసంగించారు.