డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : డక్కిలి మండలంలో 42 పోలింగ్ బూతుల్లో దొంగ ఓట్లు, డెత్,వలస ఓట్లను తొలగించే విధంగా మండల ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి చర్య తీసుకోవాలని గురువారం తాహిసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సుధీర్ బాబుకు మాజీ జెడ్పిటిసి ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల్లో మేరకు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఓటర్ లిస్టులో అక్రమాలను అరికట్టాలని, అదేవిధంగా చనిపోయిన వారి పేర్లు తొలగించాలని, గ్రామాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారు, రెండు ఓట్లు కలిగిన వారిని గుర్తించి తొలిగించాలన్నారు.ఈ కార్యక్రమం లో ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి ఘట్టమనేని. వెంకటరమణ, చెలికం భాస్కర్ రెడ్డి,మల్లెం కొండయ్య, దందోలు పెంచలరెడ్డి, పొట్ట మునేయ్య తదితరులు ఉన్నారు.