తిరుపతి : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం రాయలసీమ
ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము
వీర్రాజు హీరో మోహన్ బాబు ను మర్యాద పూర్వకంగా కలిశారు. మోహన్ బాబు బిజెపి
రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ను సాదరంగా ఆహ్వానించారు అనంతరం సోము
వీర్రాజు ని మోహన్ బాబు దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కొద్ది సేపు
ఇరువురు ముచ్చటించారు.
ఓటు అడిగే హక్కు రెండు ప్రాంతీయ పార్టీలకు లేదు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు
బిజెపి కి మాత్రమే ఉందని, రెండు ప్రాంతీయ పార్టీలకు లేదని స్పష్టం చేశారు.
రెండు ప్రాంతీయ పార్టీ ల వల్ల అభివృద్ధి జరగలేదని, అధికార పార్టీ డిగ్రీ లేని
వారికి ఓటు నమోదు చేసిందని, ఇంత కంటే దుర్మార్గం ఉంటుందా అని ప్రశ్నించారు.
అభివృద్ధి కేంద్రం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతోందని,
ఇక్కడ వెంకటగిరి లో కూడా అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగిందన్నారు.
అభివృద్ధి విషయంలో బిజెపి చర్చ కు సిద్దంగా ఉందని, రెండు పార్టీలు సిద్ధమా
అని పిలుపు ఇచ్చారు.
రహదారులు అభివృద్ధి దగ్గర నుండి సముద్ర తీరం వరకు రకరకాల అభివృద్ధి చేశామని,
ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉందని, ఎన్నికల్లో స్పష్టత ఉన్న పార్టీ బిజెపి
మాత్రమే అన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి
సూర్య నారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. తొలుత
వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని పలు విద్యా సంస్థలలో పర్యటించి ఓటర్లను కలిసి
మొదటి ప్రాధాన్యత ఓటును కొరకు అభ్యర్ధించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర
అధ్యక్షుడు సోమువీర్రాజు వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య కార్యకర్తల
సమావేశం నిర్వహించి ఎమ్మల్సీ ఎన్నికల కార్యాచరణ పై సమీక్ష చేశారు.