డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్: ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక పౌరులు ఎన్నికలలో తమ ఓటును వేసినప్పుడే ప్రజాస్వామ్యం మనుగుడా సాగిస్తుందని ఓటు మహా ఆయుధమని అది ప్రజల తలరాత మారుస్తుందని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలియజేశారని తహిశిల్దార్ రమేష్ బాబు మాట్లాడారు, శుక్రవారం జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా సీనియర్ ఓటర్లు ను సన్మానించారు, మండలంలో ఓటర్లు నమోదు కార్యక్రమంలో మంచి ప్రతిభ కనబరిచిన బిఎల్ఓ లకు అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తాహిసిల్దార్ రమేష్‌బాబు తో మాట్లాడుతూ భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక స్త్రీ పురుషులు ఓటు నమోదుకు వేయడానికి అర్హులని, తమ ఓటును తమకు నచ్చిన పార్టీలు మరియు అభ్యర్థులకు కుల మత లింగ భాషా బేధాలు లేకుండా వేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఎన్నికలలో మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే పరిపాలన అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాకతీయ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎంపీడీవో ప్రసన్నకుమారి,ఎంఈఓ వెంకటేశ్వర్లు, డీటీలు హరికృష్ణ, ప్రసన్న, సీనియర్ అసిస్టెంట్ సుధీర్ బాబు, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం,పూజిత, పార్వతి,ఆర్ఐ రాజేష్, జూనియర్ అసిస్టెంట్లు నరసింహులు, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాహిసిల్దార్ కార్యాలయం నుండి కమ్మపల్లి రోడ్డు సెంటర్ వరకు ఓటు నమోదు వినియోగంపై ర్యాలీ చేయడం జరిగింది.