ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె నివాస్
అమరావతి : వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్
ఉద్యోగుల ఇపిఎఫ్, ఇఎస్ ఐ సమస్యల పరిష్కారం కోసం అప్కాస్(ఎపి కార్పొరేషన్ ఫర్
ఔట్ సోర్స్డ్ సర్వీసెస్) చూపుతున్న చొరవ ప్రశంసనీయమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ
శాఖ కమీషనర్ జె నివాస్ అన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇఎస్ఐ కార్డులను ఆయన
అందజేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని
సోమవారం నాడు ఏపిఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో అప్ కాస్
నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నివాస్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇపిఎఫ్, ఇఎస్ఐ వంటి సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను
పరిష్కరించేందుకు ఆప్కాన్ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయటం
అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన ఇపిఎఫ్,
ఇఎస్ఐ మరియు వారి సాంకేతిక పరమైన సమస్యలను ఆప్కాస్ సిబ్బంది అక్కడికక్కడే
పరిష్కరించారు. కార్డుల ప్రాముఖ్యతను అప్కాస్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) బి.
నాగ ప్రసాద్ ఉద్యోగులకు వివరించారు. కుటుంబంలోని కొత్త సభ్యులను
చేర్చుకోవటంతోపాటు సభ్యుల వివరాలను అప్డేట్ చేయటం వంటి సమస్యలను కూడా
పరిష్కరించామని ఈ సందర్భంగా కమీషనర్ నివాస్ గారికి జిఎం వివరించారు. ఔట్
సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అన్లైన్లో పరిశీలించి, కొంతమంది వివరాలను అప్డేట్
చేయటంతో పాటు మరికొంతమందికి జాయింట్ డిక్లరేషన్ ఫారంలను కూడా అందజేశామన్నారు.
ఈ సందర్భంగా అప్ కాస్ సిబ్బందిని అభినందించారు.