న్యూఢిల్లీ : ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన టీడీపీ సభలో
తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి
వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు
ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు మోడీ తన ప్రగాఢ
సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పీఎంఎన్ఆర్ఎఫ్ (ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి) నుంచి మృతుల కుటుంబాలకు
రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధాని
ప్రకటించారు. కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న‘ఇదేం ఖర్మ
రాష్ట్రానికి’ సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
మొత్తం 8 మంది మృతిచెందగా వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి
గాయాలయ్యాయి. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు
పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్నారు.