రాజమహేంద్రవరం : జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, ఆయన కుటుంబ సభ్యులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం పరామర్శించారు. దుర్గేష్ సతీమణి ఉషా రాణి కాలం చేశారు. రాజమహేంద్రవరం లోని ఆయన స్వగృహానికి వెళ్లి కష్టకాలంలో నిబ్బరంగా ఉండాలని ఆ కుటుంబానికి మనోహర్ ధైర్యం చెప్పారు. ఉషారాణి చిత్రపటానికి అంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ సందర్బంగా జీవితంలో ఎదురైన క్లిష్ట సమయంలో మనోస్థైర్యంతో ఉండాలని దుర్గేష్ ను ఓదార్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు దుర్గేష్ ను పరామర్శించారు.