అమరావతి : ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను
ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
కత్తిపూడి సభ తర్వాత వారాహి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ మేరకు వారాహి యాత్ర
గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి
నియోజకవర్గంలోనూ జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘‘పోలవరం
ఎత్తు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది. పోలవరానికి రూ.17,144
కోట్ల నిధులిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రాజెక్టు ఎత్తును 41.15
మీటర్లకు కుదిస్తున్నట్లు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసేలా
వ్యవహరిస్తోంది. పోలవరంలో సీఎం పర్యటన దృష్ట్యా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.
పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో ప్రజలకు సీఎం చెప్పాలని నాదెండ్ల డిమాండ్
చేశారు.
క్షతగాత్రులకు నాదెండ్ల మనోహర్ పరామర్శ : వట్టిచెరుకూరు ట్రాక్టర్ ప్రమాద
ఘటనలో గాయపడినవారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జనసేన పార్టీ రాజకీయ
వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. క్షతగాత్రులకు
మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకి విజ్ఞప్తి చేశారు.
బీమా చెక్కుల పంపిణీ : ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందిన పలువురు జనసేన పార్టీ
క్రియాశీలక సభ్యులు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడ్డారు. వారిని పార్టీ రాజకీయ
వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. వీరికి వైద్య
ఖర్చులకి సంబంధించి బీమా చెక్కులను అందచేశారు. పెడన నియోజకవర్గం నీలిపూడి
గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు బుద్దన పవన్ కుమార్
ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల బీమా చెక్కును
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అందచేశారు.