స్వామి వార్ల కు ఆషాడ సారె సమర్పణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. కొత్త
గుళ్ల సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిరం నుండి
కేరళ డప్పు వాయిద్యాల, సన్నాయి మేళాల నడుమ మహిళలు అమ్మవారికి సారె
సమర్పించేందుకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు
వెల్లంపల్లి శ్రీనివాసరావు తోపాటు కన్యకా పరమేశ్వరి కమిటీ సభ్యులు, శ్రీ
దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ
లలితా పారాయణం బృందం ఆధ్వర్యంలో అమ్మ వారికీ ఆషాడ మాస లో సారె సమర్పించడం
హర్షణీయమని పేర్కొన్నారు. శ్రీ కనకదుర్గ లలితా పారాయణం బృందం ఆధ్యాత్మిక సేవ
లో తరిస్తూ దేవాలయాలలో కార్యక్రమలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.లోక
కళ్యాణర్ధం ప్రతి కుటుంబం అమ్మ వారికీ సారె సమర్పించి జగన్మాత అనుగ్రహం
పొందగలరని విజ్ఞప్తి చేశారు.
శ్రీ కనకదుర్గ లలితా పారాయణం బృందం
అధ్యక్షులు గ్రంధి రాము, రాధిక, మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి
ఆషాడమాసం పురస్కరించుకొని దుర్గమ్మకు భక్తిశ్రద్ధలతో సారె సమర్పిస్తున్నామని
పేర్కొన్నారు. వారంలో రెండు రోజులు క్రమం తప్పకుండా దుర్గమ్మ సన్నిధిలో
వందలాదిమంది భక్తులచే పారాయణం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్తీక మాసంలో
అమ్మవారికి 10 లక్షల గాజులు సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
విజయవాడ చాంబర్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, దుర్గా మల్లేశ్వర
స్వామి వారి ట్రస్ట్ సభ్యులు బుద్ధ రాంబాబు, కట్ట సత్తయ్య, కేసరి నాగమణి,
ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పోలేపల్లి సుబ్బు, శ్రీ కన్యకా పరమేశ్వరి
సత్రం అధ్యక్షుడు, కార్యదర్శిలు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్, బయన రాజేష్,
తదితర సభ్యులు, భక్తి బృందాలు సారె ఊరేగింపులో పాల్గొని ఆరాధించి కొండపై
అమ్మవారికి సమర్పించారు.