విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో
స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి, సోమవారం
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆలయ వైదిక సిబ్బంది అందరూ కుటుంబ
సభ్యులుతో కలిసి కనకదుర్గ నగర్ నుంచి ఊరేగింపుగా విచ్చేయగా ఆలయ ట్రస్ట్ బోర్డు
చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ అధికారులు వీరికి మంగళ వాయిద్యముల నడుమ ఆలయ
మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి
పవిత్ర సారె సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం మహామండపం 6 వ అంతస్తు నందు
ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి
వీరికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల
శివప్రసాద శర్మ దంపతులు, వైదిక సిబ్బంది, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా
సత్తయ్య, ఆలయ అధికారులు కార్యనిర్వాహక ఇంజినీర్ కె. వి. ఎస్ కోటేశ్వర రావు
సహాయ కార్య నిర్వాహణాధికారి పి. చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.