రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. కోటి విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
విజయవాడ : సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో
పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు
ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 33వ డివిజన్
సత్యనారాయణపురంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. కోటితో నూతనంగా నిర్మించిన 8
రహదారులు, పైపు డ్రెయిన్లను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి,
స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో డివిజన్ పూర్తిగా కళ తప్పిందని
ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా వేసిన
రోడ్లు తప్ప గత టీడీపీ ప్రభుత్వం రోడ్లను కనీసం పట్టించుకున్న దాఖలాలు
లేవన్నారు. కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని స్థాయిలలోనూ తెలుగుదేశం
ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని
ఆరోపించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత
ప్రజావసరాలను తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు
తెలిపారు. ప్రతి డివిజన్ ను ఒక యూనిట్ గా చేసుకుని అన్ని రకాల సదుపాయాలు
కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గడపగడపకి మన ప్రభుత్వంలో భాగంగా ఈ ప్రాంతంతో
పర్యటించిన సమయంలో పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడాన్ని గుర్తించడం జరిగిందని
మల్లాది విష్ణు తెలిపారు. నూతన రహదారుల నిర్మాణంతో ఈ ప్రాంత ముంపు సమస్యకు
శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ఇందులో భాగంగా జల్లా వారి వీధి, ఓగిరాల వారి
వీధి, తిరుమలశెట్టి వారి వీధి, తాడంకి వారి వీధి, దాక్షిణ్యం వారి వీధి,
పాపరాజు వీధి, కొమ్ము వారి వీధి, కనకరాజు వీధులలో 900 మీటర్ల పొడవునా
నిర్మించిన నూతన రహదారులు, 245 మీటర్ల పొడవునా డ్రెయిన్లను నేడు
ప్రారంభించుకున్నట్లు తెలిపారు.
గత పాలకులు సిగ్గుపడాలి
తెలుగుదేశం హయాంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా యూజీడీకి సంబంధించి ఈ ప్రాంతంలో
ఒక సంపు నిర్మించాలనే కనీస ఆలోచన చేయలేకపోయినందుకు గత పాలకులు సిగ్గుపడాలని
మల్లాది విష్ణు విమర్శించారు. అయినా కూడా మరలా ఏ ముఖం పెట్టుకుని సంపును
సందర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రూ. 80 లక్షల నిధులతో ఈ ప్రభుత్వం
చేపట్టిన యూజీడీ సంపు నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. మరో 2 నెలల్లో
ప్రారంభిస్తామని తెలియజేశారు. అలాగే ఆంధ్రరత్న పార్కును సైతం సర్వాంగసుందరంగా
తీర్చిదిద్దుతామని తెలిపారు. పరిపాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వానికి మరెవరూ సాటిరారని.. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో
ముందుంజలో నిలపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్)
గురునాథం, నాయకులు శనగవరపు శ్రీనివాస్, లంకా బాబు, కమ్మిలి రత్నకుమార్,
మైలవరపు రామకృష్ణ, చాంద్ శర్మ, కొల్లూరు రామకృష్ణ, ఓగిరాల రాజశేఖర్, సనత్,
తాడేపల్లి నారాయణరావు, ఝాన్సీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.