రాపూరు వెంకటగిరి ఎక్సప్రెస్ న్యూస్:-
మండలం పరిధిలో నే పెంచలకోన క్షేత్రం నందు ఆదివారం శ్రీవారికి ఉదయం అభిషేకం.ఆనంతరం కన్నులపండుగ గా కళ్యాణోత్సవం గావించిన అనంతరం చెంచులక్షి,ఆదిలక్ష్మి సమేత నరసింహ స్వామి వారి కి తిరుచ్చి పల్లకి సేవ ప్రధానార్చకులు,వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళ వాయిద్య,గిరిజనుల వాయిద్య నడుమ సహస్రదీపాలంకరణ సేవ(ఊంజల్ సేవ) వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్యూలైన్ల ఏర్పాట్లు,మంచి నీరు సరఫరా,అన్నదానం మొదలగు కార్యక్రమాలలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించడమైనది.