శిష్యులుగా రాణించవచ్చని దాజీ అన్నారు. దివంగత ఆధ్యాత్మిక గురువు లాలాజీ
మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన
కేంద్రాల్లో ఒకటైన కన్హా శాంతివనంలో జరిగిన ఈ సంగీత, ధ్యాన వేడుకలు వీక్షకులను
మంత్రముగ్ధుల్ని చేశాయి.శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు, అందరూ అభిమానంగా ‘లాలాజీ’ అని పిలిచే
రామచంద్రజీ మహారాజ్ 150వ జయంతిని పురస్కరించుకుని కన్హా శాంతివనంలో వైభవంగా
జరిగిన సంగీత, ధ్యాన ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ
మండలం చేగూరులోని ఈ శాంతివనంలో జరిగిన సంగీత వేడుకలు శ్రోతలను తన్మయత్వానికి
గురిచేశాయి.
శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు లాలాజీ మహారాజ్ 150వ జయంతిని
పురస్కరించుకుని శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో
నిర్వహించిన సంగీత పండుగ విజయవంతంగా ముగిసింది. ప్రశాంత, ఉత్సాహభరితమైన
వాతావరణం నడుమ జనవరి 25వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్యాన, సంగీత
ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ప్రఖ్యాత సంగీత విధ్వాంసురాలు కౌశికి చక్రవర్తి
గాన కచేరితో మొదలై దిగ్గజ కళాకారుల ప్రదర్శనలు అత్యద్భుతంగా సాగాయి.
చివరి రోజు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విధ్వాంసురాలు సుధా రఘునాథన్ కచేరితో ఈ
ధ్యాన, సంగీత వేడుకలు విజయవంతంగా ముగిశాయి. తన గానామృతంతో వీక్షకులను
తన్మయత్వంలో ముంచెత్తారు. మాధవ మురళి… హరే ముకుందా… గోకులవాస… గోపాల
కృష్ణా…, శంభో శివ… శంభో శంభో… స్వయంభు, స్వయంభు అంటూ ఆలపించిన గానం
ఆసాంతం అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్ర మిషన్ ఛైర్మన్ కమలేశ్
డీ పటేల్- దాజీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో
తరలి వచ్చిన ధ్యాన అభ్యాసీలతో దాజీ సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం సంగీత
విధ్వాంసురాలు సుధా రఘునాథన్ను కమలేశ్ డీ పటేల్ ఘనంగా సత్కరించారు.