‘ది కేరళ స్టోరీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అదా శర్మ ఇప్పుడు
‘కమాండో’గా మరోసారి అభిమానుల ముందుకు రాబోతుంది. విద్యుత్ జమ్వాల్ ప్రధాన
పాత్రలో నటించిన ‘కమాండో ఏ వన్ మ్యాన్ ఆర్మీతో మొదలై ‘కమాండో2 ది బ్లాక్ మనీ
ట్రయిల్’, ‘కమాండో3 లాంటి ప్రాంచైజీ సినిమాలలో ఇన్స్పెక్టర్ భావన రెడ్డిగా
అలరించిన ఈ నటి మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేమ్ పర్రిజా కీలక పాత్రలో నటిస్తూ
చిత్రరంగానికి పరిచయం కానున్నారు. సన్షైన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం
పై ‘ది కేరళ స్టోరీ’ని నిర్మించిన ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్లాల్ షా ఈ
చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా
విడుదల కానున్న ఈ సినిమాలో వైభవ్ తత్వవాడి, ఇష్టియాక్ ఖాన్, శ్రేయా చౌదరి,
అమిత్ సియాల్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఆద శర్మ ఇన్ స్ట్రా
వేదికగా ఒక పోస్టు చేస్తూ.. ‘కమాండో ఫ్రాంచైజీకి ప్రేమ్ పర్రిజాకు స్వాగతం.
కొత్త కమాండోతో యాక్షన్, అడ్వాంచర్, థ్రిల్ రానుంది’ అంటూ వ్యాఖ్యల్నీ
జోడించింది. విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపింది చిత్రబృందం.