ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనతో సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు
పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది
ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
అమరావతి : కమిషన్ల వల్లే పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, పోలవరం
ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోందని ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ
మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దాని కాంట్రాక్టు రామోజీరావు బంధువు నుంచి
పోయిందని కక్ష కట్టారని అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనతో సీఎం జగన్
చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. కరోనా టైంలో కష్టాలు వచ్చినా కీలక
నిర్మాణాలు పూర్తి చేశామని పేర్కొన్నారు. లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్
డ్యాం, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత జగన్‌దని
చెప్పారు. డయా ఫ్రం వాల్ నిర్మాణం వరదల వల్ల కొట్టుకుపోలేదని మంత్రి అంబటి
స్పష్టం చేశారు. కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం, కమిషన్ల వలనే
కొట్టుకుపోయిందన్నారు. ఆ విషయాలను రామోజీ ఎందుకు రాయటం లేదు? అని
ప్రశ్నించారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్కి మరమ్మత్తు చేయటమా? కొత్తది
నిర్మాణమా అనే దానిపై సీడబ్ల్యుసీ ఆలోచిస్తోందని చెప్పారు. కాఫర్ డ్యాంలు
పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ కట్టొచ్చని మీ పత్రికలో రాయగలరా? అని
ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్‌కి లోకేష్ కన్నా తక్కువ బుర్ర ఉందని, అందుకే
పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రూ.900 కోట్లు మాయం
అయ్యాయని వాపోతున్నారు. ఆర్.ఈ.సీ. కాంట్రాక్టును ఒకసారి చదువుకుంటే వాస్తవాలు
తెలుస్తాయని మంత్రి అంబటి తెలిపారు. అన్నిస్థాయిల్లోనూ పనులను చెక్ చేసిన
తర్వాతనే నిధులు విడుదల చేశారని వెల్లడించారు. చట్టం ప్రకారమే నిధులు విడుదల
చేశారని, అందులో తప్పేమీలేదని అంబటి చెప్పారు.
పవన్ ఏకపత్నీవ్రతుడు: ‘పవన్‌కళ్యాణ్ నిన్న తణుకు సభలో మరోసారి ఊగిపోయాడు.
ఆయన పెళ్ళిళ్ల గురించి మాట్లాడితే ఆయనకు కోపం వస్తుంది. కానీ నిత్యం ఆయన
పక్కనే ఉండే నాదెండ్ల మనోహర్‌కు మాత్రం ఏ కోపం రాదు. ఆయన ఒక కార్మిక వీరుడు.
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జనసేన ఆఫీస్‌కు రహస్య సొరంగ మార్గం తవ్వడానికి
పని చేస్తున్న కార్మిక వీరుడు నాదెండ్ల మనోహర్. ‘మల్టీపుల్ పర్సనాలిటీ
డిజార్డర్’ ఆవరించింది అంటే పవన్‌కళ్యాణ్‌కు కోపం వచ్చింది. ఇక నుంచి
పెళ్ళిళ్ల గురించి ఎత్తం. అందుకు బదులుగా, ఒక్కోసారి ఒక్కో పెళ్ళి
చేసుకున్న‘ఏకపత్నీ వ్రతుడు పవన్‌కళ్యాణ్’ అని మాత్రమే అంటాం. అప్పుడు ఆయనకు
చాలా ఆనందంగా ఉంటుంది.’ అని మంత్రి అంబటి అన్నారు.
వారిపై ఎందుకంత కడుపు మంట? : ‘వాలంటీర్ల వ్యవస్థ మీదు ఎందుకంత కడుపు మంట? వారు
ఇతర ప్రాంతం, ఇతర రాష్ట్రాల నుంచి రాలేదు కదా? ఆ 50 ఇళ్లలో నుంచి వచ్చిన వారే
కదా? అలాంటి వారిపై ఒక ఏకపత్నీవ్రతుడు, మరో ముసలాయన పిచ్చిపిచ్చిగా
వాగుతున్నారు. వారు గౌరవ వేతనం రూ. 5 వేలు మాత్రమే తీసుకుని ఎంతో సేవ
చేస్తున్నారు. మీకు నిజంగా వారి పట్ల చిత్తశుద్ధి ఉంటే.. మీరు వస్తే వారికి
లక్ష జీతం ఇస్తామని చెప్పండి. లేదా వారిని తీసేస్తామని చెప్పండి’ అని మంత్రి
అంబటి రాంబాబు అన్నారు.
1000సార్లు జగన్నామస్మరణ చేయండి : ‘ఇక నుంచి సీఎం జగన్‌ను ఏకవచనంతోనే
పిలుస్తానని పవన్ అన్నాడు. దాంతో మేము బాధ పడ్డామని, ఆయన బాధ పడిపోతున్నాడు.
పవన్, ఆ శపథం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 373 సార్లు సీఎం జగన్‌ను ఏకవచనంతో
సంబోధించాడు. అయ్యా, 1000 సార్లు అలా జగన్ పేరు ఉచ్ఛరించండి. మీరు చేసిన
పాపాలన్నీ పరిహారం అవుతాయని మంత్రి అంబటి పేర్కొన్నారు.