ఎయిమ్స్‌కు మౌలిక సదుపాయలైన కరెంటు జగనన్న ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. రూ.35 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను జగనన్న ప్రభుత్వం ఎయిమ్స్ కోసం నిర్మించి ఇచ్చిందన్నారు. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రెయినేజి పనులను తమ ప్రభుత్వమే చేపట్టిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు దక్కేలా చేశామన్నారు. అటవీ అనుమతుల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఎయిమ్స్ ప్రాంతంలో ఉన్న పాత టీబీ సెంటర్ భవనాలను తొలగించింది కూడా తమ ప్రభుత్వమే నని తెలిపారు. డంపింగ్ యార్డు సమస్యను కూడా పరిష్కరించామన్నారు. ఎయిమ్స్‌కు వెళ్లే రహదారులకు సెంట్రల్ లైటింగ్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. మొత్తం రూ.55 కోట్లను ఎయిమ్స్ లో వసతుల కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిందని వివరించారు.