బెంగళూరు : పంద్రాగస్టును పురస్కరించుకుని బెంగళూరులోని కాంగ్రెస్,
జనతాదళ్, బీజేపీ కార్యాలయాల్లో నాయకులు జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు.
బీజేపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి బవసరాజ బొమ్మై జెండా ఎగురవేసి,
స్వాతంత్య్రం వచ్చినప్పటి పరిస్థితులకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను
వీక్షించారు. కేపీసీసీ కార్యాలయంలో సేవాదళ్ కార్యకర్తల నుంచి పార్టీ
అధ్యక్షుడు డీకే శివకుమార్ పతాకాన్ని అందుకున్నారు. సేవాదళ్, కాంగ్రెస్
కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దళ్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి
కుమారస్వామి, ఎమ్మెల్సీ శరవణలతో కలిసి పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం
పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు పార్టీ నాయకులు మిఠాయిలు పంపిణీ చేశారు.
విధానసౌధ మెట్ల వరుస వద్ద విధానసభ అధ్యక్షుడు బసవరాజ హొరట్టి జాతీయ పతాకాన్ని
ఎగురవేసి, గౌరవ వందనం సమర్పించారు. ఉన్నత న్యాయస్థానం ఆవరణలో ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ బాలచంద్ర వరాళె మువ్వన్నెల పతాకానికి గౌరవ వందనం
సమర్పించి, న్యాయవాదులు, న్యాయమూర్తులను ఉద్దేశించి మాట్లాడారు.
స్వాతంత్య్రానికి పూర్వం, ప్రస్తుత పరిస్థితుల్లో జారీలో ఉన్న చట్టాల్లో
వచ్చిన మార్పులను ప్రధాన న్యాయమూర్తి వివరించారు.

బెంగళూరు రాజ్భవన్లో విందు : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని
బెంగళూరు రాజ్భవన్లో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ఇచ్చిన అల్పాహార
విందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి
కేహెచ్ మునియప్ప, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి గోవిందరాజు తదితరులు
హాజరయ్యారు. నగరంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వివరాలను గవర్నర్కు
ముఖ్యమంత్రి వివరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలతో శివకుమార్,
సిద్ధరామయ్య ఇదే సందర్భంలో కొంత సమయం ముచ్చటించారు.