కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం శెట్టర్
బెంగుళూరు : కర్ణాటకలో కాషాయ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం జగదీశ్
శెట్టర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున
ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. కర్ణాటకలో అధికార బీజేపీకి గట్టి
షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జగదీశ్ శెట్టర్
కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జగదీశ్
శెట్టర్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ చీఫ్ డీకే
శివకుమార్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఆదివారం ఆయన
బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ
సీటు నిరాకరించడం వల్ల శెట్టర్ బీజేపీని వీడారు. కాంగ్రెస్లో చేరిన అనంతరం
జగదీశ్ శెట్టర్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీని బలపరిచేందుకు పార్టీ
కార్యకర్తగా నిరంతరం శ్రమించానని అన్నారు. ‘ఆదివారమే బీజేపీ పార్టీకి రాజీనామా
చేశా. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరా. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి,
రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తాను కాంగ్రెస్ చేరడం కొందరికి ఆశ్చర్యం
కలిగిస్తోంది. బీజేపీ నాకు ప్రతి పదవి ఇచ్చింది. పార్టీ కార్యకర్తగా బీజేపీ
ఎదుగులదలకు నిరంతరం శ్రమించా’ అని జగదీశ్ శెట్టర్ తెలిపారు.