న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర అసెంబ్లీకి
ఎన్నికలు నిర్వహించే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కర్ణాటక
అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మే 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్
నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మే 13న ఎన్నికల ఫలితం
వెలువడుతుందని ప్రకటించింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం ప్రెస్
కాన్ఫరెన్స్ నిర్వహించిన అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు.నోటిఫికేషన్ విడుదల తేదీ : 2023 ఏప్రిల్ 13నామినేషన్ల స్వీకరణకు తుది గడువు:
ఏప్రిల్ 20నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 21నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్
24కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: మే 10

డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ
ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. దక్షిణ భారతదేశంలో కమలనాథులకు
సొంతంగా ప్రభుత్వం ఉన్న రాష్ట్రం ఇదొక్కటే. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి
ఆరోపణలు బసవరాజ్ బొమ్మై సర్కారుకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. అయితే, డబుల్
ఇంజిన్ నినాదం, ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాపై బీజేపీ ఆశలు పెట్టుకుంది.
కన్నడ భాషకు ప్రాధాన్యం, స్థానికత అంశాన్ని ఎన్నికల్లో లేవనెత్తుతోంది.
స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకే ప్రభుత్వం నుంచి మినహాయింపులు ఇస్తామని
గతేడాది స్పష్టం చేసింది. కన్నడ భాషాభివృద్ధి కోసం బిల్లును సైతం ఆమోదించింది.