కోట్ల సుజాతమ్మకు షాక్..
ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమంలో తిరగడిన స్థానికులుటీడీపీకి కర్నూలు జిల్లాలో షాక్ తగిలింది. కార్యకర్తలతో కలిసి టీడీపీ నేత
కోట్ల సుజాతమ్మ నిర్వహించిన ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమానికి
వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ పాలన బాగుంటే
రాష్ర్టానికి ఖర్మ ఎలా అవుతుందంటూ కోట్ల సుజాతమ్మను ప్రశ్నించారు. దీంతో
టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా అస్పరి మండలం నగురూర్ లో
జరిగింది. వైఎస్సార్ సీపీ పాలనలో వివిధ పథకాల ద్వారా తమ ఇళ్లకు ఆర్థిక లబ్ధి
చేకూరుతోందని, పథకాల కోసం జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లకుండా నేరుగా తమ
ఖాతాల్లోకి డబ్బు పడుతోందని కోట్ల సుజాతమ్మ ముందు వివరించారు. కర్నూలు జిల్లా
నుంచి దశాబ్దాల కాలంగా కోట్ల కుటుంబం ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ఎమ్మెల్యే
పదవులు చేపట్టి ప్రజలకు, కర్నూలు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. దీంతో
టీడీపీ కార్యకర్తలు స్థానికులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎన్నికలు దగ్గరకు
వస్తుంటే టీడీపీకి ప్రజలు గుర్తొస్తున్నారా అంటూ నిలదీశారు.