రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి
కర్నూలు : కర్నూలు జిల్లా పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ
కృష్ణారెడ్డి ని రాకేష్ రెడ్డి కలిశారు. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం
తీసుకున్న నిర్ణయం న్యాయమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
తెలిపారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి హైకోర్టులో భిన్న
తీర్పులు వచ్చాయని, అయితే ఒకే ప్రాంతానికి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల
రాష్ట్రానికి నష్టం
కలుగుతుందని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు సజ్జల.
సోమవారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన సజ్జల ‘ సీఎం వైఎస్ జగన్ ఆశయాలు
నెరవేరుతున్నాయి.. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు కుట్రలకు సుప్రీంకోర్టు మొట్టికాయలు కొట్టింది. ఒకే చోట
రాజధాని కట్టాలని హైకోర్టు చెప్పడం సరైనది కాదు. దానిపై సుప్రీంకోర్టు
తప్పుపట్టి, ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్, రామోజీ రావు కోరిక చంద్రబాబు సీఎం
కావాలనేది. కానీ ఇది ప్రజలు తప్పు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి
రావాలని కోరిక లేదు. చంద్రబాబు సీఎం కావాలని ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదంగా
ఉంది. సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని సజ్జల
పేర్కొన్నారు.