బాలాయపల్లి :-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకులు వరకు కష్టపడే సమయం ఆసన్న మవుతుంది మండల కన్వీనర్ వెందోటి. కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో కలిసి అధికారంలోకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ప్పటి నుంచి విడుదల చేసిన సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది ప్రతి కార్యకర్త ఒక సైనికుడు లాగా పని చేయాలని పిలుపునిచ్చారు.
కష్టపడ్డ వారిని తాము గుర్తుపెట్టుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చేయడం జరిగిం దన్నారు. మండలంలోని ప్రతి పల్లెకు రోడ్డు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన ఘనత నేదురుమల్లి కుటుంబం ఉందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఎప్పటినుంచి ఎన్నికలు పూర్తయ్యేంతవరకు అలుపెరగకుండా పనిచేయాలని కార్యకర్తలను నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం రామ్మూర్తి యాదవ్, బాలాయపల్లి సహకార సంఘం అధ్యక్షుడు పల్లంటి రాంబాబు నాయుడు వెందోటి.హరికృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:-మాట్లాడుతున్న కార్తీక్ రెడ్డి