హైదరాబాద్ : పాలమూరు నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే దామోదర్ రెడ్డి కాంగ్రెస్లో
చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి
కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు చూస్తుంటే ఈ వార్తకు మరింత బలం చేకూరుతోంది.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిని ఇరువురు కలిశారు. రాష్ట్రంలో
నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ భేటీ
అనంతరం కాంగ్రెస్లో చేరే అవకాశంపై కె దామోదర్ రెడ్డి స్పష్టమైన ప్రకటన ఇచ్చే
అవకాశం ఉంది.మరోవైపు కాంగ్రెస్ నేతలతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు వరుస
సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన మల్లు రవి, కొల్లాపూర్
నేత జగదీశ్వర్రావుతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇద్దరితో వేర్వేరుగా
సమావేశమైన జూపల్లి కృష్ణారావు రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు
జరిపినట్లు తెలుస్తోంది.