ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీపై తీవ్ర
విమర్శలు గుప్పించారు. భవిష్యత్ గురించి ఆలోచించే సామర్థ్యం బీజేపీకి,
ఆర్ఎస్ఎస్ లేవని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గతంలో
వైఫల్యాలపై ఒకరిని నిందించడమే కానీ భవిష్యత్ గురించి ఎప్పుడూ మాట్లాడరని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్..
న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్లో భారత సంతతి ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒడిశా ప్రమాద మృతులకు సంతాపంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.
భవిష్యత్ గురించి ఆలోచించే సామర్థ్యం బీజేపీకి, ఆర్ఎస్ఎస్ లేవని రాహుల్
ఎద్దేవా చేశారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే
పరిస్థితుల్లో.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఉన్నాయని విమర్శించారు.
ద్వేషాన్ని ద్వేషంతో తెంచలేమన్న రాహుల్ గాంధీ.. ప్రేమతో మాత్రమే
నివారించగలమని చెప్పారు. రైలు ప్రమాదం ఎందుకు జరిగిందంటే కాంగ్రెస్ 50 ఏళ్ల
క్రితం నిర్మించిందని అంటారు. పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, పరిణామ
సిద్దాంతం ఎందుకు తొలిగించారంటే కాంగ్రెస్ 60 ఏళ్ల క్రితం పెట్టింది కాబట్టి
అంటారు. వారి సత్వర స్పందన గతం చూడమని చెబుతుంది. మంత్రులు, ప్రధాని మాటలు
వింటే వారు భవిష్యత్ గురించి మాట్లాడటంలేదని మీరు గుర్తిస్తారు. వారు గతం
గురించే మాట్లాడతారు. గతానికి సంబంధించి ఒకరిని నిందిస్తారు. కాంగ్రెస్
అధికారంలో ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగితే బ్రిటిష్ వారి వల్లే ఈ ప్రమాదం
జరిగిందని ఎప్పుడూ చెప్పలేదు. నాకు గుర్తుంది. కాంగ్రెస్ మంత్రి ఇది నా బాధ్యత
కాబట్టి నేను రాజీనామా చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఇదే మన దేశంలో ఉన్న సమస్య
అని రాహుల్ గాంధీ తెలిపారు.