జైపూర్ : కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ )లో బీజేపీ ‘జన్ అక్రోష్ యాత్ర’ ను
తలపెట్టింది. రైతులు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ
వైఖరిని ఈ యాత్రలో ఎండగట్టనుంది. డిసెంబర్ 1వ తేదీన జైపూర్లో ఈ యాత్రకు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకారం చుట్టనున్నారు. 51 ‘జన్ ఆక్రోష్
రథాలను’ పచ్చజెండా ఊపి నడ్డా ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
సతీష్ పూనియా ఆదివారంనాడిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలోని 200
నియోజకవర్గాల్లో డిసెంబర్ 3,4 తేదీల్లో రథ యాత్రలు మొదలవుతాయని, కాంగ్రెస్
ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వాన్ని
టార్గెట్ చేస్తూ ఈ యాత్రలు సాగుతాయని చెప్పారు. రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్
ప్రభుత్వం డిసెంబర్ 17వ తేదీతో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. కాంగ్రెస్
ప్రభుత్వ తప్పిదాల పాలనకు వ్యతిరేకంగా, మార్పు కోరుతూ జన్ ఆక్రోష్ యాత్ర
నిర్వహించనున్నట్టు సతీష్ పూనియా తెలిపారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని
గెహ్లాట్ ప్రభుత్వం వాగ్దానం చేసిందని, అయితే నాలుగేళ్ల పాలనలో రైతులు మానసిక
ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనికి తోడు 9 వేల
మంది రైతుల భూములను గెహ్లాట్ సర్కార్ జప్తు చేసిందని చెప్పారు. కాంగ్రెస్
పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని,
ప్రీస్టులను సైతం సజీవదహనాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ యాత్ర ద్వారా
సుమారు 2 కోట్ల మంది ప్రజలను కలుసుకుంటామని ఆయన చెప్పారు.