భట్టి విక్రమార్క అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని
గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం మూల
సిద్ధాంతమే కాంగ్రెస్ మూల సిద్ధాంతమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
దేశంలో కాంగ్రెస్తోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. రాజ్యాంగాన్ని
అందించడంలో కృషి చేసిన కాంగ్రెస్ పట్ల నిబద్ధతతో ఉండాలని పార్టీ శ్రేణులకు
ఆయన పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని
గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ , తెరాస రాజ్యాంగాన్ని ధ్వంసం
చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా పాలన
సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ ప్రజల భావప్రకటన స్వేచ్ఛను మోడీ సర్కార్
హరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి మనుశాస్త్రాన్ని అమలు చేయాలని
బీజేపీ చూస్తోందని విమర్శించారు. దేశంలో ఆర్థిక అసమానతలను బీజేపీ పెంచి
పోషిస్తోందని, ఒకరిద్దరు కార్పొరేట్లకే దేశ సంపదను దోచిపెడుతోందని
దుయ్యబట్టారు. బీజేపీ అరాచకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి
తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ, తెరాస
కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామంటూ
కాంగ్రెస్ శ్రేణులతో ఈ సందర్భంగా భట్టి ప్రమాణం చేయించారు.