కరీంనగర్ : ఎన్నో కుట్రలు, అవరోధాలు తిప్పికొట్టి సోనియాగాంధీ తెలంగాణను
ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల
గురించి సోనియాగాంధీ ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ మాడల్ అంటే పేదల
అభివృద్ధి. బీజేపీ మాడల్ అంటే గుజరాత్ అభివృద్ధి అని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్
భగేల్ అన్నారు. కరీంనగర్ కవాతుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున కదంతొక్కారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో
తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’
చేస్తున్నారు. తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రేవంత్
రెడ్డి యాత్రను కొనసాగిస్తున్నారు. జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణులలో
నూతనోత్సాహం నెలకొంది. ఈ “హాథ్ సే హాథ్ జోడో యాత్ర”లో భాగంగానే గురువారం
కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు
ఛత్తీస్‌ఘడ్ సీఎం సీఎం భూపేశ్ భగేల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం
రమేష్, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే ముఖ్య అతిధులుగా
హాజరైనారు. వందలాది బిడ్డల ప్రాణ త్యాగాల వల్లే 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిందని
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నో కుట్రలు, అవరోధాలు
తిప్పికొట్టి సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్
పార్టీకి నష్టమని తెలిసి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఇస్తామని
సోనియాగాంధీ కరీంనగర్‌లోనే ప్రకటించారన్న రేవంత్ రాజకీయ ప్రయోజనాల గురించి
సోనియాగాంధీ ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి కేసీఆర్
అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. ఈ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
‘కరీంనగర్ కవాతు’ పేరుతో నిర్వహించిన ఈ సభకు కాంగ్రెస్ సభకు పార్టీ శ్రేణులు
కదంతొక్కారు. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో కరీంనగర్ అంబేడ్కర్
స్టేడియం హోరెత్తింది.