కాల్చే ప్రయత్నం
75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ దోచుకున్నాయి
అసమర్థ పాలనకు కేరాఫ్, అవినీతి ప్రభుత్వాలకు చిరునామా
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : మజ్లిస్ భుజంపై తుపాకీ పెట్టి తమ పార్టీని కాల్చేందుకు బీజేపీ
కుట్ర చేస్తుండగా, బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ తమను కాల్చేందుకు
కుతంత్రం చేస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన
ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే ధైర్యం బీజేపీ, కాంగ్రెస్‌లకు
లేదన్నారు. కాంగ్రెస్ వెన్నుపోటు వారసుడిని నమ్ముకొని వెన్నెముకలేని పార్టీగా
మిగిలిందన్నారు. గత 75 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని
దోచుకున్నాయన్నారు.
ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ పార్టీ అని, బీజేపీ అంటే భ్రష్టాచార్ జనతా
పార్టీ అని చురకలు అంటించారు. కానీ బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అన్నారు.
అసమర్థపాలనకు, అవినీతి ప్రభుత్వాలకు బీజేపీ, కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ అన్నారు.
ఆ పార్టీల దశాబ్దాల వైఫల్యమే రాష్ట్రానికి, దేశానికి శాపంగా మారాయన్నారు. మేం
తెలంగాణ రైతులకు రిష్తేదార్, మేం తెలంగాణ ప్రజలకు వఫాదార్… ఈ విషయం ప్రజలకూ
తెలుసునన్నారు. బీఆర్ఎస్ ప్రతి పథకం దిల్ దార్ అని, ప్రతి నిర్ణయం దమ్ దార్
అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమాన్ దార్ అని, ప్రభుత్వం పూర్తిగా జిమ్మేదార్
అన్నారు. మా తొమ్మిదేళ్ల పరిపాలన జోర్ దార్ అని, వచ్చే ఎన్నికల ఫలితాలు ధమాకే
దార్.. దేశంలోనే తెలంగాణ మోడల్.. అసర్ దార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే
బేకార్ అని, కాంగ్రెస్ చరిత్ర అంతా భ్రష్టాచార్… కాంగ్రెస్‌ను నమ్ముకుంటే
మళ్లీ అంధకారమే అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.