గుంటూరు : వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టులు, టెండర్ల చిట్టా ఇవ్వాలని మంత్రి విడదల రజని అధికారులను ఆదేశించారు. తక్షణం ఈ వివరాలను తనకు సమర్పించాలని అన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. బిల్లులు చెల్లించాల్సిన కాంట్రాక్టర్లు, జారీ చేసిన టెండర్లు, కాంట్రాక్టుల వివరాలను మంత్రి కోరారు. ఈమేరకు రాతపూర్వకంగా మంత్రి కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి రజని ఈ వివరాలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.