‘కాంతార’ చిత్రం గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దక్షిణ కన్నడ
సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డివోషనల్
యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ను
తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తొలి భాగం ఆరంభానికి ముందు జరిగిన
కథను చూపించబోతున్నారు. ఆగష్టు 27న చిత్రీకరణ మొదలుకానుందని సమాచారం. సీక్వెల్
గా రానున్న ఈ రెండో భాగం గురించి చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ప్రత్యేక
శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ సినిమా కోసం గుర్రపుస్వారీతో పాటు కొన్ని ప్రాచీన
యుద్ధ విద్యల్లో శిక్షణ పొందబోతున్నారని చెబుతున్నారు. ఇక ఈ రెండో భాగంలో
భూతకోల, పంజర్లి దైవారాధన పుట్టుపూర్వోత్తరాలను, సంస్కృతిపర మైన ప్రాధాన్యతను
ఆవిష్కరించబోతున్నారని సమాచారం. మొదటిభాగానికి పాన్ ఇండియా స్థాయిలో దక్కిన
ఆదరణ దృష్ట్యా సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక హంగులను
మేళవించి తెరకెక్కించబోతున్నారని తెలిసింది.