కాకినాడ : కాకినాడ జిల్లాలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి
ఏడుగురు బలయ్యారు. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ
ఆవరణలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ ట్యాంకర్.. శుభ్రం చేసేందుకు
ఏడుగురు కార్మికులు ఒకరి తర్వాత ఒకరు లోపలికి దిగారు. అందులో ఊపిరాడక అందరూ
మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఐదుగురిని పాడేరు వాసులుగా, ఇద్దరిని పెద్దాపురం
మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో పాడేరు వాసులుగా వెచ్చంగి
కృష్ణ, వెచ్చంగి నరసింహ, సాగర్, కె.బంజుబాబు, కుర్రా రామారావు పులిమేరుకు
చెందినవారిగా కట్టమూరి జగదీశ్, ప్రసాద్లను గుర్తించారు. ప్రమాదానికి
సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంపై ఆరా
తీశారు.