గతం లాగే సాగర సంబరాలు నిర్వహించండి
కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబుకు సిపిఐ విజ్ఞప్తి
కాకినాడ : కాకినాడ కు సుందరమైనది బీచ్ ప్రాంతం అని దానిని ప్రభుత్వం
నిర్లక్ష్యం చేయడం వల్ల వందలాది కోట్లాది రూపాయలతో నిర్మించిన శిల్పారామం
టూరిజం గెస్ట్ హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారాయని ప్రభుత్వం
దృష్టి పెట్టి కాకినాడ బీచ్ ను పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు
నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం స్థానిక కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ని సిపిఐ జిల్లా
బృందం కే బోడకొండ
పి సత్యనారాయణ దొరబాబు
టి అన్నవరం తదితర బృందం ఆయనను కలిసి పలు అంశాలను ఆయన దృష్టి కి తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తొలిసారిగా కన్నబాబు నెగ్గినప్పుడు కాకినాడ బీచ్
పై దృష్టిపెట్టారని ఆనాడు కేంద్రం పర్యట శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి గారిని
తీసుకొచ్చి పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారని
ప్రతి సంక్రాంతి సెలవుల్లో సాగర సంబరాలు ఘనంగా నిర్వహించారని దానినే టిడిపి
ప్రభుత్వం కూడా అమలు చేసిందని కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే కాకినాడ బీచ్ ను
అభివృద్ధి పనులను తుంగలోకి తొక్కిందన్నారు వందలాది కోట్ల రూపాయలు నిర్మించిన
శిల్పారామం ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ లో అనేగా పనులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు
ఇప్పటికే ఉపాధి లేక నిరుద్యోగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కాకినాడ
జిల్లాలో కోరంగి కోస్టల్ తీర ప్రాంతం ఉంది కాబట్టి ప్రభుత్వం టూరిజంపై దృష్టి
పెట్టాలని మధు కోరారు