విజయవాడ : గుంటూరు-కాచిగూడ, కాచిగూడ-గుంటూరు ఎక్స్ప్రెస్ రైళ్లను పదిరోజుల
పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బేతంచర్ల-
రంగాపురం- మల్కాపురం స్టేషన్ల మధ్య రెండో లైనును అందుబాటులోకి తెచ్చే పనుల
నేపథ్యంలో ఈ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వివరించింది.
గుంటూరు-కాచిగూడ రైలు ఈ నెల 9 నుంచి 19 వరకు, కాచిగూడ- గుంటూరు రైలు 9-20 వరకు
రద్దయ్యాయి. మరోవైపు గంగినేని-ఎర్రుపాలెం స్టేషన్ల మధ్య పనుల నేపథ్యంలో పలు
రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేస్తున్నట్లు, అదేవిధంగా మూడు రైళ్లను దారి
మళ్లించి నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. డోర్నకల్-విజయవాడ,
విజయవాడ-డోర్నకల్, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ, విజయవాడ-భద్రాచలం
రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ రైళ్లను ఈనెల 9-18 మధ్య రద్దుచేసింది.