ఈ ఏడాది ప్రారంభంలో హాలీవుడ్ నటులు జూలియా ఫాక్స్, కాన్యే వెస్ట్ మధ్య జరిగిన లవ్ ఎఫైర్ సంచలనం కలిగించింది. కేవలం ఒక్క నెల మాత్రమే డేటింగ్ చేసిన ఈ జంటపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీరిద్దరినీ సోషల్ మీడియా విపరీతమైన వివాదంలోకి లాగింది. ప్రస్తుతం వారు విడిపోయినప్పటి నుంచి జూలియా ఫాక్స్ అనేక సందర్భాల్లో కాన్వేతో తనకున్న స్వల్పకాలిక సంబంధం గురించి మాట్లాడింది. సోమవారం ఎమిలీ రతాజ్కోవ్స్కీ “హై లో విత్ ఎమ్రాటా” పోడ్కాస్ట్లో వివాదాస్పద రాపర్తో తన ప్రేమ గురించి క్లుప్తంగా తెలిపింది. ఇదిలా ఉండగా, హాలీవుడ్లో ఆమెకు ప్రస్తుతం అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెపై ఇలాంటి నెగిటివ్ కామెంట్లు రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.