విజయవాడ : పశ్చిమ నియోజకవర్గంలో
కాపు కళ్యాణ మండపానికి స్థలం కేటాయింపు పై పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థన మేరకు సహకరించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితరులకు పశ్చిమ నియోజకవర్గం లోని కాపు సామాజిక వర్గ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కొత్తపేటలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు మహదేవు అప్పాజీ రావు, యలకల చలపతిరావు, మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురి లావణ్య , అత్తలూరి ఆదిలక్ష్మి మాట్లాడుతూ కాపు కళ్యాణ మండపం కోసం పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పెట్టిన ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదిస్తూ 480 గజాల స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానించడం అభినందనీయమన్నారు. కాపు కళ్యాణ మండపం అనేది పశ్చిమ నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ప్రజల చిరకాల వాంఛ అని వారు చెప్పారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కాపుల కోసం కళ్యాణ మండపం నిర్మాణం అనేది ఏ మాత్రం నెరవేరలేదని అన్నారు. అయితే గతంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చిన విధంగా పశ్చిమ నియోజకవర్గంలో కాపుల కోసం కళ్యాణ మండపానికి కౌన్సిల్ స్థలం కేటాయించడం చారిత్రాత్మక విషయమని వారు అన్నారు. 42 డివిజన్లోని వైయస్సార్ పార్క్ సమీపంలో కాపు కళ్యాణ మండపం కోసం 480 గజాల స్థలాన్ని కేటాయించడానికి కృషిచేసిన శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశీనేని నాని, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి షేక్ ఆసిఫ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,అవుతు శైలజ రెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, సహకరించిన కార్పొరేటర్లకు వారు అభినందనలు తెలియజేశారు. కాపు సామాజిక వర్గ ప్రజల అందరి అభిష్టానికి అనుగుణంగా ఇక్కడ కాపు కళ్యాణ మండపం నిర్మాణం అయ్యేందుకు తామంతా కృషి చేస్తామని వారు చెప్పారు. సమావేశంలో కాపు సంఘం నాయకులు ఆకుల శ్రీనివాస్, ఎస్వీ రంగారావు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు మైలవరపు దుర్గారావు, నవ్యాంధ్ర కాపు సంఘం వ్యవస్థాపకులు కోన హేమసుందర్ రావు,వడ్లని మాధవరావు, పాత శివాలయం చైర్మన్ బోమ్ము మధు, సింహాచలం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కూరకుల నాగ, ఎస్వీ రంగారావు కాపు సంఘ అధ్యక్షులు పదిలం రాజశేఖర్,చల్లంరాజు సత్రం మాజీ చైర్మన్ వాసా బాబు, వడ్డూరి యశోదర, ముక్క రమణ, అల్లం పూర్ణ, దంగేటి పెద్ద కొండ, వరద రమేష్, అరసవిల్లి కంచిబాబు,సురకాశి శ్రీనివాసరావు, కర్రి గౌరీ, నారిండి శ్రీనివాస్, దొడ్ల రాజా, పల్లాంటి దుర్గారావు, మద్దాల అప్పారావు, తదితర కాపు నాయకులు పాల్గొన్నారు.