విజయవాడ : కాపు సామాజిక వర్గం పై అంత ద్వేషం ఎందుకని జన సేన రాష్ట్ర అధికార
ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ
కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి,
విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్
మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్క అంగుళం
కూడా అందుబాటులోకి రాలేదని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడు పూర్తి చేస్తారో
ప్రజలకు వెల్లంపల్లి శ్రీనివాస్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం గతంలోనే కార్పొరేషన్
కి ఫీజులు చెల్లించారని, అయినా కూడా ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని
అందుబాటులోకి తీసుకురావటం లేదన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ రావు, మేయర్
సమాధానం చెప్పాలని, మూడున్నర సంవత్సరాలు అవుతున్న కేటీ రోడ్డు ని పూర్తి
చేయలేక పోయారని ఎప్పుడు పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలని, వెల్లంపల్లి
ఇంటికి మేయర్ ఇంటి దగ్గర అయితే రోడ్లు త్వరగా పూర్తి చేశారని, కానీ కేటి
రోడ్డు మాత్రం పూర్తి చేయడం లేదని, కేటీ రోడ్ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల
లోటత్తు ప్రాంతాలు ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన
చెందుతున్నారన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలు సొంత ఇంటి కల నెరవేరుతుందని, అద్దెల భారం
ఉండదని గత ప్రభుత్వంలోనే అప్పులు చేసి టిట్కో ఇళ్లకు చెల్లిస్తే ఇప్పటివరకు
వారికి అందించలేకపోయారని, ఈ అంశం పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఆందోళన చేసామని, టిడ్కో ఇల్లని ఎందుకు వారికి
అందచేయలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని, టిడ్కో ఇళ్లని వైసిపి నాయకులు
కొట్టేయాలని కుట్ర దాగి ఉందని, జగనన్న కాలనీలు, సెంటు భూమి పథకంలో వెలంపల్లికి
సున్నా మార్కులు వచ్చాయని, వెయ్యి మంది కూడా పట్టాలు ఇవ్వలేకపోయారన్నారు.
రిజిస్ట్రేషన్ చేయలేక పోయారని, దీనికి వెల్లంపల్లి సమాధానం చెప్పాలని,
వెల్లంపల్లి శ్రీనివాసరావు మాత్రం వెల్లంపల్లి ఫౌండేషన్ పేరుతో భూకబ్జాలు
చేస్తున్నారని, ట్రస్టులు పేరుతో ఆస్తులు పెంచుకుంటున్నారని, సితార సెంటర్
వద్ద ఉన్న ధార్మిక శాఖ భూమిని కూడా వైసిపి కార్యాలయం ఏర్పాటు చేయాలని కుట్రతో
ఆ విలువైన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న మీ ప్రయత్నాన్ని పశ్చిమ
నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.