కారుణ్యనియామాకాల ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
జిఏడి సెక్రటరీ పోలా బాస్కర్ వద్ద సచివాలయంలో ఉద్యోగసంఘాలతో సమావేశం
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
అమరావతి : కారుణ్యనియామాకాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ జేఏసీ అమరావతి
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏపిజెఏసి అమరావతి
రాష్ట్రకమిటి చేపట్టిన 92 రోజుల ఉద్యోమంలో బాగంగా ఒక ప్రధాన డిమాండు గా ఉన్న
కోవిడ్ లో చనిపోయిన ఉద్యోగుల కుంటుంబంలో ఒకరికి ఖాళీలతో, రోస్టర్ పాయింట్ల తో
సంబందం లేకుండా కారుణ్య నియామకం ను ఏ డిపార్టు మెంటులో ఖాళీ ఉంటే
ఆడిపార్టుమెంటులో ఉద్యోగ అవకాశం కల్పించించి ఆకుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని
చేసిన విజ్ఞప్తి మేరకు మంగళవారం జిఏడి సెక్రటరీ పోలా బాస్కర్ వద్ద సచివాలయంలో
ఉద్యోగసంఘాలతో జరిగిన సమావేశంలో ఈ డిమాండ్ పై సుదీర్ఘంగా చర్చించారు. గత
రెండు సంవ్సరాలుగా ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన కోరుతున్న ముఖ్యమైన
ఈ అంశంపై నేటి చర్చల్లో ప్రభుత్వం సానూకూలంగా ఉందని హామి ఇచ్చారు అని
చెప్పారు. అలాగే ఈసమావేశంలో జరిగిన చర్చలలో బాగంగా గ్రూప్ – 1 ఆఫీసర్స్ ఆ
పైబడి హోదాకలిగిన వారందరికీ ఏసిఆర్ ను ఆల్ఇండియా సర్వీస్ ఉద్యోగుల మాదిరిగా
ఆన్ లైన్ లో ఇకపై పెడతామని తెలిపారు. అంతేకాకుండా ఏపి జెఏసి అమరావతి
కోరికమేరకు ఇప్పటివరకు ఉన్న టైపిస్టుకేడర్ వారికి తప్పకుండా తెలుగు టైప్ పాస్
అవ్వాల్సి ఉండగా, ఇక నుండి కంప్యూటర్ ప్రోఫీషీఎన్సీ(సిపిటి) టెస్టు పాస్ అయితే
సరిపోతుందని, భవిష్యత్ లో టైపిస్ట్ పోస్టులను కూడా జూనియర్ అసిస్టెంట్లు గా
మర్పు చేస్తున్నామని, భవిష్యత్ లో టైపిస్టు పేరుతో నియామాకాలు ఉండవని అందరు
జూనియర్ అసిస్టెంటులుగానే నియామాకాలు చేపడతామని తెలిపారు. వీటితోపాటు
వివిధసంఘాల రికగ్నేషన్లు తధితర అంశాలకు చర్చకు వచ్చాయి. అంతేకాకుండా జిఏడి
పరిధిలో పెండింగు ఉన్న సమస్యలు అన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ఇకపై ఉద్యోగ
సంఘాలు గ్రీవెన్సులు జిఏడికి ఆన్ లైన్లో మెయిల్ లో పంపినా నిభందనలకు లోబడి
ఎక్కడ అన్యాయం జరిగినా సరే న్యాయం చేస్తామని జిఏడి సెక్రటరి హామి ఇచ్చినట్లు
బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు.