చనిపోయిన జిల్లా పరిషత్ ఉపాద్యాయులు, ప్రధానోపాధ్యాయుల కుటుంబ సభ్యులకు
తక్షణమే ఓన్ టైం సెటిల్మెంట్ క్రింద కారుణ్య నియామకాలు చేపట్టాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణనిసత్కరించిన ఆంధ్రప్రదేశ్
ప్రధానోపాధ్యాయుల సంఘం
కారుణ్య నియామకాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు పట్ల హర్షం
విజయవాడ : విజయవాడలోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని వారి క్యాంప్
కార్యాలయంలో బుధవారం ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘమైన ఏపీ హెడ్మాస్టర్స్
అసోసియేషన్ తరపున కలిసి ప్రాథమిక పాఠశాలల విద్యా పర్యవేక్షణ బలోపేతం
చేయడానికి నూతనంగా రాష్ట్ర వ్యాప్తంగా 679 మండల విద్యాధికారి- 2 పోస్టులను
మంజూరు చేసి, సీనియారిటీ ప్రాతిపదికన ప్రధానోపాధ్యాయులను నియమించినందుకు
విద్యాశాఖ మంత్రి ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన విద్యాశాఖ మంత్రి
బొత్స సత్యనారాయణని కృతజ్ఞతా పూర్వకంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంలో
విద్యాశాఖ మంత్రికి కి కొన్ని ముఖ్యమైన అంశాలపై ఏపీ హెడ్ మాస్టర్స్
అసోసియేషన్ పక్షాన వినతిపత్రం అందించారు.
దాదాపు 7 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం
స్థాపన నుంచీ ప్రభుత్వ పాఠశాల విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తూ 1996 లో
ప్రభుత్వ గుర్తింపు పొంది, దాదాపు 26 సంవత్సరాలు నుండి పాఠశాల విద్యా
రంగాన్ని అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులకు
నేతృత్వం వహిస్తున్న “ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం” రాష్ట్ర
అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ఇరువురికి ఆన్ డ్యూటీ సౌకర్యం
కల్పించాలని, సమస్యల్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం
చేయడానికి “ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్లో” కూడా శాశ్వత
సభ్యత్వం కల్పించాలని కోరారు. కోవిడ్ కి ముందు, కోవిడ్ కాలం, కొవిడ్ తర్వాత
కాలంలో చనిపోయినటువంటి జిల్లా పరిషత్ యాజమాన్యం లోని అనేక మంది ఉపాధ్యాయలు,
ప్రధానోపాధ్యాయుల కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాల్సి
ఉన్నప్పటికీ, తగినన్ని ఖాళీలు జిల్లా పరిషత్ పరిధిలో లేనందున (కేవలం జిల్లా
పరిషత్ పరిధిలోనే నియమించాలి), గత మూడు సంవత్సరాలుగా అనేక మంది కారుణ్య
నియామకాలు కోసం ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం
ప్రకారం కేవలం జిల్లా పరిషత్ పరిధిలోనే కారుణ్య నియామకాలు కల్పిస్తున్నారని
అలా కాకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద ఇతర శాఖల్లో వచ్చే ఖాళీల్లో కూడా
కొన్ని సంవ్సరాలపాటు ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్ ఉపాద్యాయులు,
ప్రధానోపాధ్యాయులుకుటుంబాల వారసులకు కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టి, వారి
జీవితంలో వెలుగులు నింపాలని విజ్ఞప్తిచేశారు.
నూతనంగా ఏర్పాటు చేసిన 679 ఎంఈఓ- 2 పోస్టులకు, అప్గ్రేడ్ హై స్కూల్ హెచ్ ఏం
లకు, జీవో 117 లో వచ్చిన ఉపాధ్యాయులకు , హై స్కూల్ ప్లస్ లోని పీజీటీ లకు
2 నెలలుగా జీతాలు లేవని, కేడర్ స్ట్రెంత్ అప్ డేట్ చేసి వెంటనే జీతాలు
చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఇంకా
రావాల్సిన 60 శాతం, 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రావాల్సిన పాఠశాల నిర్వహణ
నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ సమస్యలపై స్పందిస్తూ కారుణ్య నియామకాలు కల్పించడం మా ప్రభుత్వం
భాధ్యత అని, తక్షణమే ఉత్తర్వులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ
ఇచ్చారు. కొత్త యం. ఈ. ఓ లకు జీతాలు కూడా వెంటనే చెల్లించే విధంగా అధికారులకు
అక్కడికక్కడే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, మిగిలిన సమస్యలపై కూడా ప్రభుత్వం
సానుకూలంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను
అందిస్తూ, విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఏపీ ప్రధానోపాధ్యాయులు సంఘాల
నాయకులను కోరారు.
ఈ కార్యక్రమం లో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు , ఏపీ
హెచ్ఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలమల శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షులు
పి.వి.రమణఏపీ జేఏసీ అమరావతి సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు,
కోశాధికారి వివి మురళి కృష్ణ నాయుడు, పబ్లిసిటీ సెక్రెటరీ బి.కిషోర్ కుమార్
మరియు రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన ఏలూరు జిల్లా అధ్యక్షులు డివి రమణ రంగయ్య
అరుణ్ కుమార్ గిరిబాబు కడప జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా
అధ్యక్ష కార్యదర్శులు కాంతారావు వెంకటరావు రమణయ్య గోపి రామిరెడ్డి శివరామకృష్ణ
కోనసీమ జిల్లా శ్రీనివాస్ గారు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరావు
కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం గారు విజయరామారావు,డేవిడ్
రాజు,సురేష్,సుబ్రహ్మణ్యం ప్రధానోపాధ్యాయులు,మండల విద్యా శాఖాధికారులు, ఏపీ
జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు, ఎన్ టీ ఆర్ జిల్లా నాయకులు తదితరులు
పాల్గొన్నారు.
కారుణ్య నియామకాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు పట్ల హర్షం : అర్హతలకు తగ్గ
పోస్టులో అవసరమైతే రోస్టర్ విధానం మార్చుకొని అయినా సరే 1149 మందికి కారుణ్య
నియామకాలు పూర్తి చేసే విదంగా ఉత్తర్వులు మంజూరు చేయడం పట్ల, దీనిపై సుదీర్ఘ
కాలంగా పోరాటం చేసిన ఏపీ జేఏసీ అమరావతి హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి,
ముఖ్యమంత్రి, మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులకు, మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని
పరిష్కారానికి తీవ్ర కృషి చేసిన సిఎస్ కె యస్ జవహర్ రెడ్డి ఐఏఎస్ గారికి, జిఎ
డీ కార్యదర్శి పోలా భాస్కర్ కి ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు, సెక్రటరీజెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్
టి.వి.ఫణిపేర్రాజు, రాష్ట్రకోశాధికారి వి.వి.మురళికృష్ట నాయుడు ధన్యవాదాలు
తెలిపారు. ఒకసారి అప్పాయింట్ మెంట్ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత చేరకపోతే,
భవిష్యత్ లో వారికి ఇక కారుణ్య నియామకం కోరే అర్హత ఉండదని స్పష్టం చేశారు.