వారణాసి : కాశీ మహాక్షేత్రంలో దేవ్ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. త్రిపురాసుడిపై మహాశివుడి విజయానికి గుర్తుగా పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున ఈ వేడుకలు నిర్వహిస్తారు. దేవ్ దీపావళిని పురస్కరించుకొని కాశీ క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రజలు గంగానది వద్ద భారీ ఎత్తున ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. గంగా హారతిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. దీపాల వెలుతురులో వారణాసి నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ చిత్రాలను ప్రధాని నరేంద్ర మోడీ , ఉత్తర్ప్రదేశ్ బీజేపీ శాఖ ట్విటర్ ద్వారా పంచుకున్నాయి.