కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని మే 8న బ్యాంకులకు బ్రిటన్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. “వచ్చే సంవత్సరం హిజ్ మెజెస్టి కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి గుర్తుగా అదనపు బ్యాంక్ సెలవును ప్రకటించాలని ప్రధానమంత్రి రిషి సునాక్ నిర్ణయించారు. మే 6 శనివారం పట్టాభిషేకం తర్వాత మే 8 సోమవారం నాడు బ్యాంక్ సెలవుదినం వస్తుంది” అని బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
“కొత్త చక్రవర్తి పట్టాభిషేకం మన దేశానికి ఒక ప్రత్యేకమైన క్షణం. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని, వచ్చే ఏడాది యునైటెడ్ కింగ్డమ్ మొత్తానికి అదనపు బ్యాంక్ సెలవును ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది” అని ప్రధాని రిషి సునక్ అన్నారు.