విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో చేరటంపట్ల
హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్కు
శుక్రవారం ఉదయం ఫోను చేసి శుభాకాంక్షలు తెలిపానన్నారు. ఆయనతో త్వరలోనే
సమావేశమై రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై చర్చిస్తానన్నారు. కిరణ్ కుమార్ చేరికతో
రాష్ట్రంలో బీజేపీ మరింత శక్తివంతమై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి 2024
సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని సోము వీర్రాజు స్పష్టం
చేశారు.