71 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ సోమవారం రాత్రి తన మాజీ
భార్య, హాలివుడ్ నటి కిరిస్టీ అల్లీ మరణించడంతో పార్కర్ స్టీవెన్సన్
ప్రేమపూర్వక నివాళి అర్పించారు. కిర్స్టీ అల్లీ, పార్కర్ స్టీవెన్సన్ కు
ఇద్దరు పిల్లలు. విలియం, లిల్లీ. కాగా, తమ వివాహం నాటి ఫోటోను సోషల్ మీడియాలో
పోస్ట్ చేస్తూ పార్కర్ స్టీవెన్సన్ హృదయపూర్వక సందేశాన్ని రాశారు. ‘ప్రియమైన
కిరిస్టీ,’ మనం కలిసి కొన్ని సంవత్సరాలు గడిపినందుకు.. ఇద్దరు పిల్లలు..
ఇప్పుడు మనవరాళ్ళు.. నేను చాలా కృతజ్ఞుడను. మిమ్మల్ని మిస్ అవుతున్నాము..
ప్రేమతో పార్కర్.’ అని పేర్కొన్నారు. కాగా, కిర్స్టీ అల్లీ (71) కొంత కాలంగా
క్యాన్సర్ తో బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస
విడిచారు. ఈ విషయాన్ని కిర్స్టీ కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్, కుమార్తె
లిల్లీ ప్రైస్ స్టీవెన్సన్ వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేశారు. తమ
తల్లికి క్యాన్సర్ ఉందని ఇటీవల గుర్తించామని, దానితో పోరాడుతూనే ఇవాళ ఆమె
మరణించారని వారు పేర్కొన్నారు. ఆమె ఇన్నాళ్లూ గొప్పగా పోరాడిందని, ఆమె
జీవితంలోని అంతులేని ఆనందాలను తమకు వదిలేసి వెళ్లిపోయిందని, మోఫిట్ క్యాన్సర్
సెంటర్లోని వైద్యులు, నర్సుల బృందం ఆమెకు అద్భుతమైన చికిత్స అందించారని,
వారికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
నటి కిర్స్టీ అల్లీ 1970లో బాబ్ అల్లీని వివాహం చేసుకున్నారు. 1977లో
విడిపోయారు. తర్వాత పార్కర్ స్టీవెన్సన్ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు
జన్మనిచ్చారు. అల్లీ 1987 నుంచి 1993 వరకు ఎన్బీసీ సిట్కామ్ ‘‘చీర్స్’’లో
రెబెక్కా హోవే పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందారు. ఈ పాత్ర కోసం ఆమె 1991లో
ఎమ్మీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అందుకున్నారు. ఆమె ‘‘డ్రాప్ డెడ్ గార్జియస్’’,
‘‘వెరోనికాస్ క్లోసెట్’’, ‘‘ఇట్ టేక్స్ టూ’’, ‘‘సిబ్లింగ్ రివాల్రీ’’, ‘‘షూట్
టు కిల్’’, ‘‘లవర్ బాయ్’’, ‘‘రన్ అవే’’ వంటి డజన్ల కొద్దీ సినిమాలు చేశారు.
టీవీ కార్యక్రమాల్లో హోస్ట్ గా కూడా వ్యవహరించారు. అల్లీ మరణం పట్ల ఆమె
సహనటుడు జాన్ ట్రావోల్టా విచారం వ్యక్తంచేశారు. ‘‘కిర్స్టీతో నాకు
ప్రత్యేకమైన అనుబంధం ఉంది’’ అని ఇన్స్టా గ్రామ్ లో పేర్కొన్నారు. అలాగే మాజీ
భర్త పార్కర్ స్టీవెన్సన్ కూడా నివాళి అర్పించడం విశేషం.