ఇవి రుచికి తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉంటాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ ల కంటే
కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషక
పదార్థాలు ఈ కిస్మిస్ లో దాగి ఉన్నాయి. మరి ఈ కిస్మిస్ లో ఉండే ఔషధగుణాలు
ఏమిటంటే…
1) కిస్మిస్ లో విటమిన్-B, రాగి అధికంగా ఉంటాయి. ఇది కాలేయానికి సంబంధించిన
వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
2) వీటిని తినడం వల్ల ఎర్ర రక్తకణాలు అధికంగా ఉత్పత్తి అయి రక్తం సరఫరా
మెరుగుపడుతుంది. హైబీపీ లాంటివి రాకుండా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
3) వీటిని చలికాలంలో ఎక్కువగా తింటే శరీరంలో బ్యాక్టీరియా చేరకుండా కాపాడి
ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.
4)ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
5) చాలా మంది ఎండిన ద్రాక్షను అలాగే తింటారు. అలాకాకుండా ఎండిన ద్రాక్షను
నానబెట్టి తినడం వలన అధికంగా పోషకాలు లభిస్తాయి.
6) ద్రాక్షను నానబెట్టిన నీటిని తాగితే ద్రాక్షలో ఉండే పోషక విలువలన్నీ
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
7)కిస్మిస్ లో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది.
8) అలాగే ఇందులో ఉండే పాలిఫినాలిక్ ఫైటో శరీరం వాపును తగ్గిస్తాయి.
9) అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా
అడ్డుకుంటాయి.
10) అలాగే పిల్లల మెదడు చురుకుగా ఉంటుంది.
11) అధిక బరువు ఉన్నవారు దీన్ని తింటే త్వరగా బరువును తగ్గవచ్చు.
12) వీటిని ఎక్కువగా తీసుకుంటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
13) నీరసంగా ఉండేవారు దీన్ని తింటే ఒంట్లో నీరసం తగ్గుతుంది.
14) ప్రతి రోజు కిస్మిస్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు పొందవచ్చు.