శ్రీహరికోట : విజయవంతంగా రోదసి చేరిన చంద్రయాన్–3 ప్రయోగం 41 రోజుల ముఖ్యమైన
ప్రయాణంలో కీలక దశ దిశగా సాగుతోంది. దానికి జత చేసిన థ్రస్టర్లను మండించే
ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం నుంచే మొదలు పెట్టారు. తద్వారా
ఉపగ్రహాన్ని భూమి నుంచి కక్ష్య దూరం పెంచే ప్రక్రియ మొదలైంది. అంతిమంగా
చంద్రయాన్–3ని ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై వీలైనంత సున్నితంగా
దించాలన్నది లక్ష్యం. చంద్రయాన్–3ని శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని తిరుపతి
జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా
విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. రోదసిలో దాని ప్రయాణం అద్భుతంగా సాగుతోందని
తిరువనంతపురంలోని విక్రం సారాబాయి స్పేస్ సెంటర్
డైరెక్టర్ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్ శనివారం మీడియాకు తెలిపారు. తొలి దశ
ప్రయోగం నూటికి నూరు శాతం విజయవంతమైందన్నారు.