విశాఖపట్నం : గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ విజయానికి కృషి చేసిన అందరికీ
కృతజ్ఞతలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు సదస్సులో భాగంగా
రెండో రోజైన శనివారం విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను
ప్రారంభించి అనంతరం ఆయన ప్రసంగించారు. గత మూడున్నరేళ్లలో ఆర్థికంగా రాష్ట్రం
ముందడుగు వేస్తోంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కోవిడ్ కష్టాలను కూడా
అధిగమించాం. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయి. ఇప్పుడు
కీలక సమయంలో సదస్సు నిర్వహించాం. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నాం.
గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా 15 సెక్టార్లలో సెషన్స్ నిర్వహించాం. ఈ
15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయి. రెండు రోజుల్లో 352 ఎంవోయూలు
జరిగాయి. వందకు పైగా స్పీకర్లు పాల్గొన్నారు. మీ అందరి పెట్టుబడులతో రాష్ట్రం
మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం.
చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని సీఎం జగన్ పేర్కొన్నారు.