విజయవాడ : మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ మృతి పట్ల
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం
చేశారు. బుధవారం తిరుపతిలో కుతూహలమ్మ మృతి చెందగా, ఆమె ఐదు పర్యాయాలు
ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా
పనిచేశారన్నారు. కుతూహలమ్మ కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి
తెలిపారు.కుతూహలమ్మ మృతి బాధాకరం

నారా చంద్రబాబు నాయుడు
గుంటూరు : మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అకాల మరణం బాధాకరమని టీడీపీ జాతీయ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జెడ్పీ ఛైర్ పర్సన్ గా,
ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవులు అధిరోహించి మహిళల
అభ్యుదయాన్ని చాటి చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె చేసిన సేవలు
చిరస్మరణీయం. గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఆమె ఎప్పటికీ
చిరస్థాయిగా నిలిచిపోయారు. కుతూహలమ్మ మృతికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ
సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని కలిగించాలని
కోరుకుంటున్నాం.