కుష్టు వ్యాధి ప్రచార కార్యక్రమం పోస్టర్ విడుదల లో జిల్లా కలెక్టర్ సూర్య
కుమారివిజయనగరం : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం
జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు 15 రోజులపాటు కుష్టు వ్యాధి
గురించి ప్రజలలో అవగాహన కల్పించుట కొరకు” స్పర్స్ లెప్రసీ అవగాహన ప్రచార
కార్య క్రమం నిర్వహించుట జరుగుతుందని కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ఈ
ప్రచార కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జాతీయ కుష్టు
నివారణ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలలో కుష్టు వ్యాధి పట్ల అవగాహన కల్పించుటకు,
ముఖ్యంగా కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ఉండుట తీసుకోవలసిన
చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తము ఈ 15 రోజుల పాటు జిల్లాలో
ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల ఆధ్వర్యంలో స్పెర్స్
లెప్రసి అవగాహన కార్యక్రమం -2023 నిర్వహించుట జరుగుతుందని తెలిపారు. సోమవారం
స్పందన లో అందుకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేసారు. అనంతరం ఆడిటోరియం బైట
ఏర్పాటు చేసిన ప్రచార పోస్టర్ పై సంతకం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ
కుష్టు అవగాహన ప్రచార కార్యక్రమంలో అందరూ భాగస్వాములై కుష్టు రహిత సమాజం కోసం
చేయి చేయి కలుపుదాం అని పిలుపు నిచ్చారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల
ప్రేమాభిమానాలు చూపిస్తూ వారిని గౌరవిద్దాం, లెప్రసితో పోరాడుదాం, కుష్టు
వ్యాధిని గత చరిత్రగా మార్చేద్దాం, కుష్టు వ్యాధి లేని సమాజాన్ని నిర్మిద్దాం
– అనే నినాదాలతో బాధ్యత గల పౌరులు అందరూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొని
విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లెప్రసీ, ఎయిడ్స్, క్షయవ్యాధి
నివారణ అధికారి డాక్టర్ జె . రమేశ్వరీ ప్రభు పాల్గొన్నారు.