హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ -తెలంగాణ మధ్య కృష్ణా నదిపై కొల్లాపూర్-నంద్యాలను
కలుపుతూ నిర్మించే ఐకానిక్ బ్రిడ్జిపై బిజెపి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
అభ్యంతరం చెప్పారు. హైదరాబాద్ లో కేఆర్ఎంబీ ఛైర్మన్ ను సోమవారం కలిసిన ఆయన
ఐకానిక్ వంతెన కేవలం సెల్ఫీలకే పనికొస్తుంది. బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడితే
నీటి నిల్వకూ పనికొస్తుంది. కృష్ణా బోర్డును విశాఖకు తరలించాలని జగన్
నిర్ణయించడం సీమకు ద్రోహం చేయడమే. కేఆర్ఎంబీ బోర్డును కర్నూలుకు తరలించాలని
వెల్లడించారు.