ప్రజలంతా ఖాళీ చేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశాలు
ఒట్టావా : కార్చిచ్చు కెనడాను వణికిస్తోంది. నార్త్‌వెస్ట్ టెరిటరీస్
రాజధాని అయిన ఎల్లోనైఫ్ నగరం వైపు అగ్నికీలలు దూసుకొస్తున్నాయి. దీంతో
అప్రమత్తమైన స్థానిక ప్రభుత్వం ప్రజలంతా తక్షణం ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ
చేసింది. ఇప్పుడు ఆ దావానలం పదుల కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ వారాంతంలో
ఎల్లోనైఫ్ శివార్లను సమీపిస్తుందని పేర్కొంది. ఆ నగరంలో అత్యవసర పరిస్థితిని
ప్రకటించింది. ‘‘మీరు ఇక్కడే ఉండాలనుకుంటే మీతోపాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో
పడేసినట్లే’’ అంటూ అప్రమత్తం చేసింది. ఎల్లోనైఫ్ నగరంలో 20,000 మంది
నివసిస్తున్నారు. మూడు వేలమంది జనాభా కలిగిన హే రివర్ పట్టణంలోకూడా తరలింపు
ప్రక్రియ జరుగుతోంది.