‘కెప్టెన్ మిల్లర్’ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు ధనుష్. ఆయన
కథానాకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కిస్తున్నారు.
సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర
ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందులో ధనుష్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన
లూయిస్ మెషిన్ గన్ను చేతిలో పట్టుకొని యుద్ధ భూమిలో నిల్చొని కనిపించారు.
బ్యాగ్రౌండ్లో వేలాది మంది సైనికులు విగత జీవులై పడి ఉన్నారు. 1930-40ల మధ్య
కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని
తెరకెక్కిస్తున్నారు. ధనుష్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతున్న
చిత్రమిది. సందీప్ కిషన్, శివ రాజకుమార్, ప్రియాంక మోహన్ తదితరులు కీలక
పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల
చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్